AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1--- ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి.విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చర్ల ప్రాంతానికి చెందిన న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు. గురువారం చర్ల మండలం లింగాపురంపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సంతోష్ కుమార్ మిత్ర బృందం తరఫున నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి పరిటాల రమణ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ విద్యనభ్యసించిన పాఠశాలకు తన వంతు సేవలందించాలనే తపనతో వితరణ ను అందించిన సంతోష్ కుమార్ అభినందనీయుడని అన్నారు. న్యాయవాదిగా పనిచేస్తూ తన మిత్రుల సహకారంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు బ్యాగులు చెప్పులు తదితర వస్తువులను అందిస్తున్న సంతోష్ కుమార్ మరెందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. దాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాను ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదువుకున్నానని ఈ పాఠశాలలో గురువులు నేర్పిన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ వల్లనే న్యాయవాదిగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నానని అన్నారు. తనతో పాటు న్యాయ విద్య చదువుకున్న మిత్రులందరూ కలసి లింగాపురంపాడు ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకుంటున్నామని ప్రకటించారు. పాఠశాలకు సంబంధించిన అవసరాలను తమ శక్తి మేర తీరుస్తామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు విద్యార్ధులకు వితరణ అందించిన న్యాయవాది సంతోష్ కుమార్ ను పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు రామకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయులు బివిఎస్ఎల్ నరసింహారావు గ్రామ పెద్దలు సాధం లోకనాథం, సాధం దామోదర బాబు వనవాసి కళ్యాణ పరిషత్ బాధ్యులు పెద్దాడ ఆశాలత కాకర్ల సత్యేంద్ర కుమార్ ఏ ఏ టి సి చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెండ బోయిన సర్వేశ్వరరావు ఉపాధ్యాయులు పున్నం వెంకటరమణ చిడెం హిమగిరి బాబు, తుర్రం జలంధర్ శ్రీలక్ష్మీ,గౌతమి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily