Wednesday, 04 March 2026 01:49:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి )నూతన కమిటీ ఎన్నిక జేఏసీ చైర్మన్ గా కోరం సూర్యనారాయణ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 October 2025 06:35 PM Views : 504

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల అక్టోబర్ 12/ అక్షరం న్యూస్/--- మండల కేంద్రం లోని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఆదివాసి జేఏసీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జేఏసీ చైర్మెన్ గా కోరం సూర్యనారాయణ వైస్ చైర్మన్ గా కారం నరేష్ ట్రెజరర్ గా శ్యామల రామారావు ఊయికే బాలకృష్ణ సోషల్ మీడియా ఇన్చార్జిగా కంగాల అభి ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మెన్ లు మాట్లాడుతూ ఆదివాసి హక్కులకై ఆదివాసి చట్టాల కై ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాల రక్షణకై ఆదివాసీలు ఐక్యతతో ముందు సాగుదామని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 నీ పునరుద్ధీకరణ కై 1/70 రక్షణకై 5 వ షెడ్యూల్లో ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏజెన్సీలో జడ్పీటీసీ ఎంపీటీసీ లను ఆదివాసీలకే కేటాయించాలని బిసి డిక్లరేషన్ ఏజెన్సీలో చెల్లదని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం పూర్తి స్థాయిలో కమిటీ నీ ఏర్పాటు చేశారు. గౌరవ సలహాదారులుగా ఇర్ప శీను (మార్కెట్ కమిటీ చైర్మన్) తెల్లం రమణయ్య (రిటైర్డ్ టీచర్) బెండ బోయిన సత్యనారాయణ ఇర్ప రాజు దోర ఆదివాసి ఐక్య పరిరక్షణ వేదిక ఇర్ప జగపతి రావు ఇర్ప శాంత (మాజీ ఎంపీపీ )ఆదివాసి సంఘం నాయకులు ఇర్ప వసంత్ వాసం ముసలయ్య సోయం రాజారావు( మాజీ జడ్పిటిసి),పాయం సత్యనారాయణ 9 తెగల రాష్ట్ర అధ్యక్షులు తాటి రామకృష్ణ తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు బెండబోయిన మురళీమోహన్ (యుటిఎఫ్ జిల్లా నాయకులు) నూపా పోతయ్య నూపా రమేష్ సోమరాజు అడ్వకేట్ ఫారం ఇర్ప సూరిబాబు మడకం చందు మూలవాసి సంఘం నూప తిరుపతి మాజీ సర్పంచ్,కారం కన్నరావు మాజీ సర్పంచ్,AtA లక్ష్మీపతి పాలవంచ రామారావు మాజీ ఎంపిటిసి ఇర్ప అర్జున్ సున్నం సుబ్బయ్య ఆదివాసి సీనియర్ నాయకులు కణితి. భానుప్రకాష్ ఆదివాసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :