D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ అక్టోబర్ 29 (అక్షరం న్యూస్) ఉమ్మడి ఖమ్మం జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గా పని చేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు యాదవ సంఘం నాయకులు కూరాకుల నాగభూషణం యాదవ్ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయి ఇంటికి వచ్చిన క్రమంలో ఈరోజు టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకొని త్వరగా కోలుకొని జన జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. చట్టసభల్లో బీసీ ల ప్రాతినిధ్యం కొరకు 60 శాతం ఉన్న బీసీ లు పార్టీలకతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారుఈ కార్యక్రమం లో పాల్గొన్న నాయకులు మూడు ముంతల గంగరాజు యాదవ్, సత్తి వెంకన్న యాదవ్, గుమ్మా రోశయ్య యాదవ్, సింగాల భిక్షం యాదవ్, నాగరాజు యాదవ్, చిత్తారు శ్రీను యాదవ్, సైదులు యాదవ్, సతీష్ యాదవ్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily