AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్, : వరంగల్ జిల్లా (క్రైమ్ ) ఎంజీఎం /అక్షరం న్యూస్ :ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రాంతాల ప్రజల ఆరోగ్యం కోసం ఎమర్జన్సీ అంబులెన్స్ సేవలు ప్రాంతలుగా ఉన్నాయి.నగర నలుమూలలలో జరిగే ప్రమాదలను (108)సమాచారం ద్వారా తెలుకొని ప్రమాదం జరిగిన ప్రొంతానికి వెళ్లి ప్రమాదం జారినవాళ్ళను ఎంజీఎం కు తీసుకు వెళ్లేవాహనం అంబులెన్సు. ప్రమాదం జరిగి ప్రాంతం నుంచి అంబులెన్స్ పైలెట్ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదప్రాంతం నుంచి ప్రమాదం జరిగిన వాళ్లను ప్రాణాలను ఆరాచేతుల్లో పెట్టుకొని ప్రయాణమార్గంలో వస్తున్న ఇబ్బందులను తట్టుకొని సమయఅనుకూలంగా ఎంజిఎం కు వస్తుంది. కానీ అస్సలు ఇబ్బంది అంబులెన్స్ పైలెట్ కు లోపల మొదలవుతుంది. లోపల క్యాజువాలిటీ దగ్గర ప్రవేట్ వాహనం నిలపబడి ఉంటాయి. అంబులెన్స్ వచ్చింది అనీ వాహన దారులు సకలో స్పందించి వాహనాలను పక్కకు జరపారు.పోనీ అనీ కొంచెం ముందుకు పొతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఎంట్రన్స్ దగ్గర కనీసం నాలుగు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మాత్రమే. కానీ వాళ్ళలో ఒక్కరైనా స్పందించి అడ్డుగా ఉన్న ప్రైవేట్ వాహనలను తొలగించే ప్రయత్నం చేయరు. అలాంటి సమయాల్లో పది, పదిహేను నిముషాల సమయం హృదఅవుతూ అంబులెన్స్ పైలెట్స్ కు నరకంగా మారుతుంది. సిబ్బంది, సెక్యూరిటీ సమయానుకూలంగా స్పందించి వాహనాలను పక్కకు జరిపితే అంబులెన్సులు లు తిరగడానికి సులభంగా ఉంటుందని అంబులెన్స్ పైలెట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily