D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జూలై 9 (అక్షరం న్యూస్) ఖమ్మం :చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఈ నెల 10న శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగానికి రూ. 9 వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను జమ చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి తో పాటు మన పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కావున మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి సూచనల మేరకు పాలేరు పరిధిలోని ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలు, ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్థాయిలో సమన్వయం చేసుకొని ప్రజలను, రైతులను భారీ సంఖ్యలో సభా వేదికకు తరలించి సభను జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily