Wednesday, 04 March 2026 01:43:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లాడలో సుదీర్ఘ సేవలందించిన కానిస్టేబుల్ బాలాజీ బదిలీ*..

చాకచాక్యంగా వ్యవహరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వైనం*.. *జిల్లా ఉన్నతాధికారులు చేతుల మీదుగా ఎన్నో అవార్డులు, రివార్డులు*.. *తల్లాడ మండలంలో సుస్థిర స్థానాన్ని పదిల పరుచుకున్న బాలాజీ*..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 25 May 2025 05:38 PM Views : 1506

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మే 25/ తల్లాడ (అక్షరంన్యూస్)* పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన కానిస్టేబుల్ గా, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతగా తల్లాడ పోలీస్ కానిస్టేబుల్ బాణోతు బాలాజీ పేరు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాలోని తల్లాడలో ఒకే మండలంలో సుమారు 8మంది ఎస్ఐల దగ్గర విధులు నిర్వహించిన కానిస్టేబుల్ గా మంచి రికార్డును, పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నాడు. ఏడేళ్ల పాటు విధులు నిర్వహించి అటు పోలీస్ శాఖలో, ప్రజాప్రతినిధుల్లో, తల్లాడ మండల ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అనేకమంది ప్రాణాలను కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కరోనా కష్టకాలంలో సైతం వెనకడుగు వేయకుండా ప్రజలు ఎవరు ముందుకు రాకపోయినప్పటికీ ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారు. దొంగతనాల్లోనూ, మిస్సింగ్ లోనూ, సెల్ ఫోన్ చోరీల్లో అనేక ఘటనల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని చేదించడంలో తనకంటూ ప్రత్యేక పాత్రను పోషించి జిల్లా ఉన్నత అధికారుల నుండి రివార్డులు, అవార్డులు అందుకున్నారు. *సేవల్లోనూ గుర్తింపు*.. నిత్యం బిజీగా ఉండే పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే తన తండ్రి బానోతు బాలకృష్ణ పేరు మీద అభాగ్యుల సత్రాన్ని నిర్మించారు. కల్లూరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన అభాగ్యుల సత్రాన్ని నిర్మించి ఎంతోమంది అభాగ్యులకు అండగా ఉంటున్నాడు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన సేవాభావాన్ని చాటుకున్నాడు. *ఖమ్మం ట్రాఫిక్ కు బదిలీ*.. తల్లాడలో ఏడేళ్ల పాటు విధులు నిర్వహించి సాధారణ బదిలీల్లో భాగంగా ఖమ్మం ట్రాఫిక్ కు బదిలీ అయ్యారు. మండలంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించినందుకుగాను ఆయన బదిలీని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విధి నిర్వహణలో బదిలీ సర్వసాధారణం గనుక ఆయన ఖమ్మంలో కూడా పేరు, ప్రఖ్యాతలు సాధించి, మంచి హోదాలో ఉండాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :