P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి అక్టోబర్ 02 (అక్షరం న్యూస్) విజయదశమిని పురస్కరించుకొని గురువారం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఆయుధ పూజలోఎస్సై దికొండ రమేష్ ఆయుధాల కు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్‌శాఖలో ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తుందని కష్ట సమయాల్లో విజయం సిద్ధించాలని, వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ఎలాంటి అపాయాలు లేకుండా ఆయు రారోగ్యాలతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో జీవించాలని కోరారు. అనంతరం ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ది కొండ రమేష్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily