AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి( పెద్దపెల్లి జిల్లా) నవంబర్ 16 అక్షరం న్యూస్: మంథనిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన పురిగిరి క్షత్రియ (పెరిక) సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పోశం , రాష్ట్ర నాయకులు మందా లింగయ్య, సుంకరి ఆనంద్, దాసరి మల్లేశం తదితరులకు సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని పురిగిరి క్షత్రియ (పెరిక) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల పెరిక సంఘం అభివృద్ధికి రాష్ట్ర నాయకులు సహాయ సహకారాలు అందించాలని, మండలంలో సంఘం సొంత కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని మండల నాయకులు కోరారు. దీనిపై రాష్ట్ర నాయకులు స్పందిస్తూ రామగిరి మండల పురిగిరి క్షత్రియ సంఘం అభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. తమను ఘనంగా సన్మానించిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దుండి మల్లేశ్, గోవిందుల ఆనంద్, జిల్లా నాయకులు బత్తుల రమేష్, సెంటినరీ కాలనీ సంఘం అధ్యక్షులు బుగ్గే కుమార్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, కోశాధికారి కందుల సదయ్య, బుద్దే ఉదయ్, దుండే రవీందర్, చింతం కిరణ్ కుమార్, సందెల కుమార్, బుద్ధి శంకరయ్య, అంకతి నాగన్న, ఉగ్గే కొమురయ్య, కొట్టే భీమన్న, ఉగ్గే నవీన్, ప్రవీణ్,పి రమేష్,సందెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily