D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 13 (అక్షరం న్యూస్) సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, మధిర మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కట్టా గాంధీ మృతి పట్ల ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. గాంధీ మరణ వార్త తెలియగానే వారి కుమారులు కట్టా పూర్ణ, సుధీర్, చందు గార్లతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కమ్యూనిస్ట్ యోధుడుగా గాంధీ ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని భౌతికంగా మన మధ్య లేకపోయినా మధిర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. మధిర రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన మంచి ప్రజా నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ నామ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
.
Aksharam Telugu Daily