AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్ /ఆగస్టు 25: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కొరకు , రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ విడుదల కొరకు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షుడు నాయకోటి రాజు పిలుపు మేరకు సోమవారం బూర్గంపాడు మండల రేషన్ డీలర్స్ అధ్యక్షుడు బాణోతు రెడ్యా నాయక్, కార్యదర్శి బాణోతు బాలాజీ ఆధ్వర్యంలో బూర్గంపాడు ఉపతహశీల్దార్ పీ. సమ్మయ్య కు మెమోరండం అందించారు. అనంతరం అధ్యక్షుడు రెడ్యా నాయక్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా ఒక నెల లేద రెండు నెలలు జీతం రాకపోతే కుటుంబ పోషణ ఎంత ఇబ్బంది గా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఐదు నెలలుగా కమీషన్ రాకపోవడంతో డీలర్లు అప్పులపాలై జీవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జూన్,జులై, ఆగస్టు మూడు మాసాల కు కలిపి ఒకేసారి బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది, అయినా ఎన్నో వ్యయప్రయాసాలనోర్చి ఉదయం 7 గంటల మొదలు రాత్రి 10 గంటల వరకు బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆదేశానుసారం ఏ పనికైన సిధ్ధంగా ఉన్నా డీలర్ల సమస్యలు తీర్చకపోవడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కమీషన్ పెంపుపై అనేక సార్లు ప్రభుత్వం కు వినతులు ఇవ్వడం, నిరసనలు తెలియజేయడం పరిపాటిగా మారింది. అయినా కూడా డీలర్ల పై ప్రభుత్వం సీతకన్ను వేయడం బాధాకరమని అన్నారు. డీలర్ల కు వచ్చేదే నామమాత్రపు కమీషన్ అది కూడా రెగ్యులర్ గా రాకపోతే ఎలా బ్రతకాలని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్య. ఇప్పటికైన ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ హుస్సేన్ డీలర్లు వెంకటశ్వర్లు, రమేష్, శ్రీను, కే.క్రష్ణాచారి తదితరులు పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily