Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 26(అక్షరం న్యూస్ ) ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో మన హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకుగాను మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎన్ఎస్ యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మన మంత్రివర్యులు గడిచిన 15 నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తోపాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు మంత్రి కి ఎన్ ఎస్ యు ఐ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమూర్తి శ్రీనివాస్ ,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు రాహుల్,హుస్నాబాద్ పట్టణ 19వ వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దొబ్బల అనిల్ తదితరులు పాల్గోన్నారు..
.
Aksharam Telugu Daily