DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, డిసెంబర్ 13 – అక్షరం న్యూస్: ప్రజల సమస్యలను నేరుగా ప్రజల ముందుకు తీసుకెళ్తూ, ప్రజాపక్షం వహిస్తూ నిరంతరం ప్రశ్నించే అక్షరం దినపత్రిక నిజమైన ప్రజా గొంతుకగా పనిచేస్తోందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యలను బాధ్యతాయుతంగా, నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న అక్షరం సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలు—ఇవన్నింటి మధ్య వారధిగా అక్షరం దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్ కుమార్, టిపిఎస్ వినయ్, అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్, పాత్రికేయులు పని సుదర్శన్, సోమకుమార్, నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily