D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా నవంబర్ 15 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ సమీపంలో, యూనియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన దేవన్ జనరల్ హాస్పిటల్‌ను ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ లాలు బాబుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వైద్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు. వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. వైరా నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దేవన్ జనరల్ హాస్పిటల్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మండల, పట్టణ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు కాపా మురళీకృష్ణ, లైలా వెంకటరెడ్డి, రాంపుడి రోశయ్య, డాక్టర్ కోటయ్య, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily