Wednesday, 01 April 2026 04:32:46 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పొంగులేటి పై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విష ప్రచారం మానుకోవాలి*

పొంగులేటిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ విమర్శలు ఆరోపణలు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్


MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 01 April 2026 11:42 AM Views : 67

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /అశ్వాపురం/1 ఏప్రిల్ /అక్షరం న్యూస్: అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఓరుగంటి వీరయ్య భవనం నందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ...టిఆర్ఎస్ నేతలు చేస్తున్న విష ప్రచారం మానుకోవాలి లేదంటే ప్రజలనుంచి తగిన గుణపాఠం ఎదుర్కొనవలసి వస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు శుద్ధ పూసలేం కారని ప్రజాబలంతో ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే బిఆర్ఎస్ లీడర్లకు ఎందుకు అంత భయం, గులాబీ నాయకుల మందంతా కలిసి ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడని గత అసెంబ్లీ ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన శబదం ఒక్కడినంటే ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పినట్టే చేసి చూపించిన నాయకుడి శబదం ఈరోజుకి కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ మాటలు ఇంకా చెవిలోనే తిరుగాడుతున్నాయని అదే కొనసాగిస్తూ బిఆర్ఎస్ పార్టీకి మనుగడ లేకుండా చేస్తున్నారని గతంలో జరిగిన లోక్ సభ, పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలలో వరుసగా పొంగులేటి బిఆర్ఎస్ పార్టీని అంతకంటే అంతగా పాతాళంలోకి తొక్కుతున్నాడని తట్టుకోలేకే ఈ కక్ష సాధింపు చర్యలకు గులాబీ పార్టీ నాయకులు దిగుతున్నారు, నాడు పల్లెలలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తానన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లుకూడా ఇవ్వలేదని, నేడు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే ప్రజలలో ఆయనకు మంచి పేరు వస్తుందని పొంగులేటిని నేరుగా ఎదుర్కోలేక,ఎదుర్కొనే దమ్ము లేక ఆయనకు ప్రజలలో వస్తున్న పేరును చూసి ఓర్వలేక ఈ విమర్శలు, ఆరోపణలు గులాబీ పార్టీ నాయకులు చేస్తున్నారని ఎన్ని ఆరోపణలు చేసిన వాటిని పట్టించుకోకుండా మా నాయకుడు పేదల పెద్దన్న పొంగులేటి ఇందిరమ్మ ఇండ్లతో పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పొంగులేటికి ప్రజల ఆశీర్వాదాలు కొండంత బలం వాటి ముందు ఈ గులాబీ నాయకుల ఆరోపణలు పనికిమాలినవని ఇట్టి అసత్య ప్రచారాలను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ ఖండించారు.ఈ కార్యక్రమంలో తురుమలగూడెం పంచాయతీ ఉపసర్పంచ్ ధరావత్ హర్ష నాయక్, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే మోసిన్, అశ్వాపురం మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్, ధరావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :