AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 06 అక్షరం న్యూస్ పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో శ్రీ ఆదర్శ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జయంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు విష్ణు భక్తుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు శ్రీనివాస్, సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ ధన్వంతరి నారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, కుల సంఘం ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నారాయణదాసు నర్సయ్య, నారాయణదాసు నంబయ్య, కొమరయ్య, రాజమల్లు, శ్రీనివాస్, వెంకటేష్, కుమార్, వివేక్, ప్రశాంత్, అజయ్, రాకేష్, నారాయణదాసు కుమారస్వామి, నాగసాగర్, శ్రీకాంత్, కుమార్, సోన్నాయిల వంశీకృష్ణ, అభిషేక్, కంది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily