GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -10(అక్షరం న్యూస్ ) 1980 ఫొటో ట్రెండ్ అంటే వింటేజ్ ఫొటో ట్రెండ్ ఇప్పుడు వైరల్ ట్రెండ్‌గా మారింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ ) మన పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుచేయడంలో సరికొత్త విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో ఇప్పుడు 1980 లుక్‌లో కనిపించేందుకు అందరూ పోటీ పడుతున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు ఈ ఫొటో ట్రెండ్ ను ట్రై చేసి, తమ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి, మురిసిపోతున్నారు. రెట్రో లుక్‌లో ఆ కాలంనాటి డ్రెస్సులు, మేకప్, వాచ్ వంటి యాక్సెసరీస్, హెయిర్ స్టైల్స్‌తో తామెలా కనిపిస్తామోనని క్రేజీగా ఫీల్ అయ్యేవారంతా ఏఐ టూల్ సాయంతో పాత స్టైల్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు.భారతీయ శైలి ఫోటోల కోసం 80ల నాటి ప్రసిద్ధ డిజైన్లను వాడుతున్నారు. మహిళలకు రంగురంగుల చీరలు, కర్లీ హెయిర్‌స్టైల్స్, పెద్ద ఆభరణాలు ఉపయోగిస్తుంటే, పురుషులకు లూజ్ షర్టులు, హై-వేస్ట్ ట్రాజర్లు, పెద్ద మీసాలు వింటేజ్ లుక్ ఇస్తున్నాయి. ఈ రోజుల్లో దిగిన సెల్ఫీపై ఫిల్టర్ వేయడం కంటే, నిజంగానే 1980ల్లో తీసిన ఫోటోలా అనిపించడమే ఈ ట్రెండ్ సాధించిన అసలైన విజయం.
.
Aksharam Telugu Daily