DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి జిల్లా/జనవరి 12/అక్షరం న్యూస్:యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని క్రీడలపై దృష్టి సారించాలని క్రీడలు పై దృష్టి సారించాలని క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతమిస్తుందని మండలంలోని క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ బంగారి రమేష్ అన్నారు మండల కేంద్రంలో సోమవారం చీఫ్ మినిస్టర్ కప్ 2025 టార్చ్ ర్యాలీని పలువురు క్రీడాకారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ గతంలో క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కావని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బంగారి రమేష్, ఉపసర్పంచ్ గోలి సుధాకర్, మరియు పాలకవర్గ సభ్యులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily