Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఏప్రిల్ 20 (అక్షరం న్యూస్) ఓదెల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థులు నాగపురి రాజు పరకాల తిరుపతి మిట్టపల్లి శంకర్ పి బిక్షపతి నూతి శంకర్ ఆధ్వర్యంలో ఓదెల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1999 2000 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి విద్య గురువులైన రంగారావు గిరిధర్. మల్లారెడ్డి విజయ్ కుమార్ వెంకటేశ్వర్లు నతానియాల్ సమ్మయ్య రాజేష్ కుమార్ తీర్థాల సదానందం లను ఘనంగా శాలువులతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ గురువులు మాట్లాడుతూ, అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 25 ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకుని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా ఉపయోగం ఉందని మన తోటి చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు వారు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవన విధానం ఏమిటి వారి పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది క్లుప్తంగా ప్రతి ఒక్కరికి ఈ పరిచయ వేదికపై అర్థమవుతుందని ఎలాంటి సమస్యలను ఒకరికొకరు పంచుకోవడం ఎవరికైనా ఆపద కలిగితే మేమంతా ఉన్నాం అనే ఒక సందేశం పంపడమే దీని ఉద్దేశం అని అదే విధంగా మరియు విద్యార్థులకు కావాల్సింది మంచి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏ స్థాయిలో ఉన్న మనం కలిసి చదువుకునే రోజుల్లో కలిగిన జ్ఞాపకాలను స్మరించుకోవడం అనేది ఒక గొప్ప విషయం అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మ్యాస్ కంప్యూటర్. ప్రధానమైనవని మెరుగైన విద్య తోటే ఆర్థిక లాభాలు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో ఒకటి అయ్యామని ఆప్యాయత అందరు ఈ వేదికపై పలకరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily