AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట్/నేరేడుచర్ల : సూర్యాపేట /నేరేడుచర్ల,చిల్లపల్లి,సెప్టెంబర్ 06: అక్షరం న్యూస్ నవ సమాజ నిర్మాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు నేరేడుచర్ల మండలం చిల్లపల్లి గ్రామంలో ఆదివారం ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేరేడుచర్ల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యడవల్లి అరుణ్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యడవల్లి అరుణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనతో దళిత సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అసమానతలు క్రమంగా తొలగిపోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు అవకాశాలకు నోచుకోని మాల, మాదిగ తదితర ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ దళిత సమాజంలో సమానత్వ సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీ: ఎంఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాతంగి బిక్షం మాదిగ, అధికార ప్రతినిధిగా కడప ప్రసాద్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పాతకోటి గంగరాజు మాదిగ, కార్యదర్శిగా పరంగి మైసయ్య మాదిగ, ఉపాధ్యక్షులుగా నన్నెపంగా బంగారు మాదిగ, కార్యదర్శిగా మాతంగి సైదులు మాదిగ, ప్రచార కార్యదర్శిగా నన్నెపంగా ముసలయ్య మాదిగ, సహాయ కార్యదర్శిగా పాతకోటి రామయ్య మాదిగ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మాతంగి సైదులు, ఇరుగు రవి, మాతంగి సన్నీ, బట్టు సైదులు, ఇరుగు లింగయ్య, నన్నెపంగా కిరణ్, నన్నెపంగా గిరి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily