Saturday, 28 November 2026 08:37:07 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భారత రాజ్యాంగమే సకల జనులకు రక్షణ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య

ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 27 November 2026 03:55 PM Views : 39

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 26 అక్షరం న్యూస్ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి, సకల జనులకు భారత రాజ్యాంగమే అసలైన రక్షణ కవచమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య అన్నారు.గురువారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య,ఉత్తర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు హాజరయ్యారు.వారితో ఇతర నాయకులతో కలిసి లంక సదయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య మాట్లాడుతూ దేశంలోని దళిత, బహుజన వర్గాలతో పాటు సకల జనులకు రాజ్యాంగం ద్వారానే సమాన హక్కులు కల్పించిన మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.అణగారిన వర్గాలు సామాజికంగా,ఆర్థికంగా,విద్యాపరంగా,సాంస్కృతికంగా,రాజకీయంగా అభివృద్ధి చెందడానికి నిరంతరం శ్రమించిన త్యాగజీవి అంబేద్కర్ అని ఆయన సేవలను గుర్తుచేశారు.బాబాసాహెబ్ కల్పించిన రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షణ దిక్సూచి అని,ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈర్ల స్వరూప సురేందర్,నాయకులు కవ్వంపల్లి సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస రాజేష్,రాష్ట్ర కార్యదర్శులు పాలరాజేశం,ఆకునూరి బాలంకూస్,నాయకులు ఉప్పులేటి నరేష్, కాంపల్లి జీవన్,కనుకుంట్ల సమ్మయ్య, కల్లేపల్లి అశోక్,బొల్లి నందయ్య,దొమ్మటి శేఖర్,పుల్లూరు మహేందర్,గద్దల శశిభూషణ్, పేరుకు రవి తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :