AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ అక్టోబర్ 21/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జమ్మి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జమ్మి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని పేర్కొంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసానికి వెళ్లే సమయంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద భద్రపరిచి పూజలు చేశారని, అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత తిరిగి జమ్మి చెట్టును పూజించి ఆయుధాలను తీసుకుని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని విజయం సాధించారని వివరించారు. అప్పటి నుంచి జమ్మి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు. దసరా పర్వదినాన జమ్మి చెట్టును పూజించడం ద్వారా విజయాన్ని, శుభాలను పొందాలని ప్రజలు ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో చేపట్టే పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జావిద్, కౌన్సిలర్లు కుతాడి తిరుపతి, యాట్ల సునీత, అశోక్, మాజీ సర్పంచ్ రవికుమార్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, సాయినాథ్ యూత్ అధ్యక్షుడు కందారపు రాజేష్, బలబత్తుల శ్రీకాంత్, ఆకుల సురేష్, శ్రీధర్, తుమ్మ రాజేష్, శ్రీకాంత్, సురేష్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రముఖులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily