MALLUGARI DINESH REDDY, DUBBAKA, SIDDIPET.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా / దుబ్బాక / అక్టోబర్ 9 / అక్షరం న్యూస్ -: జాతీయ రహదారిపై కారులో వెళుతుండగా, ఇటుకల లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన దుబ్బాక మండలం హబ్సిపూర్ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం..... కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్తీక్ పీపీ, అతని బావమరిది నందు (30) ఆలేరులో ఒక బేకరీ దుకాణం నిర్వహిస్తున్నారు. వీరు రామాయంపేట నుంచి కామారెడ్డి మార్గంలో నూతనంగా ఒక బేకరీ షాప్ ను ఏర్పాటు చేసేందుకు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫార్చునర్ కారులో ఆలేరు నుంచి రామాయంపేటకు బయలుదేరారు. కారును నందు డ్రైవ్ చేస్తున్నాడు. హబ్సిపూర్ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారును ఇటుకల లోడుతో అజాగ్రత్తగా నడుపుతూ ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి, నందు అక్కడికక్కడే మృతిచెందగా, కారులోని నలుగురికి, ట్రాక్టర్ పైన ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన నందు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ పీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
.
Aksharam Telugu Daily