D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 4 (అక్షరం న్యూస్) ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పాలేరు నియోజకవర్గ పర్యటన నిమిత్తం ఆదివారం హెలికాప్టర్‌లో విచ్చేసిన మంత్రికి ఐడీవోసీలోని హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సాదర స్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడంతో హెలిపాడ్ పరిసరాలు సందడిగా మారాయి.
.
Aksharam Telugu Daily