D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 6 (అక్షరం న్యూస్ ) గంగారం మండలం లోని జిల్లా పోలీసు అధికారి (ఎస్‌పీ) శ్రీ శబరిష్ గారి నాయకత్వంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు మరియు చట్టపరమైన చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ అందించి, మత్తు పదార్థాల బానిసత్వం నుండి బయటపడేందుకు అవసరమైన సహాయం మరియు మార్గదర్శకత్వం కల్పించబడుతోంది అయితే, కౌన్సిలింగ్ అనంతరం కూడా తమ ప్రవర్తనలో మార్పు తీసుకురాకుండా గంజాయి వినియోగాన్ని కొనసాగించే వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా, వ్యక్తిగత లేదా ఇతర కారణాల వల్ల గంజాయి అలవాటుకు బానిసలైన వారు స్వచ్ఛందంగా పోలీసు శాఖను సంప్రదించినట్లయితే, వారికి తగిన కౌన్సిలింగ్, వైద్య సహాయం మరియు సరైన మార్గనిర్దేశం సూచించి ఆ అలవాటు నుండి దూరం చేయడానికి పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుంది గంజాయి విక్రయం, రవాణా, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన ఏదైనా సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే, వారు టోల్ ఫ్రీ నంబర్ 87126 56999 కు సమాచారం అందించవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి కూడా అందజేయబడుతుంది.
.
Aksharam Telugu Daily