AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : పెద్దపల్లి టౌన్ జూలై 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ఎలిగేడు గ్రామ సర్వే నంబర్ 226లో తన భూమికి సంబంధించి వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని,క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ మరియు సర్వే నిర్వహించిన పిమ్మటే అధికారులు నిబంధనల ప్రకారం తనకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేశారని ముంజంపల్లి లింగమూర్తి స్పష్టం చేశారు.మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ,తనపై మరియు రెవెన్యూ అధికారులపై సింగిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబం చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ముంజంపల్లి లింగమూర్తి,ముంజంపల్లి సదయ్ మాట్లాడుతూ 2015లో చట్టపరమైన పత్రాలతో కొనుగోలు చేసిన తన భూమిని,ఎటువంటి నోటీసులు లేకుండా ఆక్రమించేందుకు రామచంద్ర రెడ్డి కుటుంబం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో రైతు బంధు పథకంలో తన పేరు తొలగించినప్పుడు,కలెక్టర్ జోక్యంతో క్షేత్రస్థాయి సర్వే జరిపించి హక్కులను పొందినప్పటికీ,ప్రస్తుతం సింగిరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు లేనిపోని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.సర్వే నంబర్ 226లో తనకు దక్కిన 18 గుంటల భూమి విషయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తన పేరును రికార్డుల్లో నమోదు చేశారని తెలిపారు.గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా సర్వే నిర్వహించి,వాస్తవాలు నిర్ధారణ అయిన తర్వాతే రికార్డులను పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన అసలు భూమి విస్తీర్ణం 8 ఎకరాల 35 గుంటలు మాత్రమేనని, కానీ వారు రిజిస్ట్రేషన్ పత్రాలలో దీనిని 9 ఎకరాల 10 గుంటలుగా తప్పుగా చూపిస్తున్నారని లింగమూర్తి ఎత్తిచూపారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఆర్ అండ్ బి శాఖకు వారి భూమి నుండి 15 గుంటలు వెళ్ళినప్పటికీ, దానికి ప్రభుత్వం నుండి ఇప్పటికే లబ్ధి పొందుతూనే, భూమి పోతుందనే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాన్ని నిరూపించే అన్ని పత్రాలను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు వారు తెలిపారు.క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలా ఉండగా, కొంతమందితో కలిసి తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని,తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం మానుకోవాలని వారు హితవు పలికారు. ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం పారదర్శకంగా నిర్వహించిన సర్వే ఫలితాలే తన భూమికి ఉన్న చట్టబద్ధతకు నిదర్శనమని లింగమూర్తి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బూత్కూరి రాజమల్లు, కవ్వంపల్లి శ్రీనివాస్, ముంజంపల్లి మల్లేష్, ముంజంపల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily