AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్/ సెప్టెంబర్ 5: బూర్గంపాడు మండల పరిధిలోని గాంధీనగర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆటో డ్రైవర్ ప్రభుకి ఆర్థిక సాయం అందించిన గాంధీ నగర్ ఆటో యూనియన్ మరియు సారపాక ఆటో యూనియన్ కార్మిక సభ్యులు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీ నగర్ గ్రామవాసి ఆటో డ్రైవర్ ప్రభు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ కనీసం హాస్పిటల్లో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉండి ఇంటిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గాంధీనగర్ ఆటో యూనియన్ మరియు సారపాక ఆటో యూనియన్ సభ్యులు ఈరోజు ప్రభు ఇంటికి వెళ్లి యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో 9000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ జానీ మరియు సారపాక ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సయ్యద్ టిప్పు సుల్తాన్. ప్రధాన కార్యదర్శి నాగరాజు. సారపాక ప్రధాన కార్యదర్శి ఎస్ రాము.తుమ్మల కిరణ్. బింగి రాజు.ట్రెజరీ కుమార్. ముఖ్య సలహాదారుడు ఏసు పాదం మరియు గాంధీనగర్ మరియు సారపాక ఆటో యూనియన్ కార్మిక సభ్యులు పాల్గొనడం జరిగింది. ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రభు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు...
.
Aksharam Telugu Daily