AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి హైదరాబాద్ రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని నిజామాబాద్(D) బోధన్(M) ఎరాజ్ పల్లెకు చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారిస్తూ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు, మ్యుటేషన్లు, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా? ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ, కేసును 4 వారాలకు వాయిదా వేసింది.
.
Aksharam Telugu Daily