DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : . కాల్వ శ్రీరాంపూర్ / మార్చి 29 / అక్షరం న్యూస్:మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా నవ క్రాంతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఇండియా నవ క్రాంతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ పర్యావరణం పరిరక్షణ కోసం మరియు గ్రామీణ ప్రాంతాలలో రైతులతో సేంద్రియ వ్యవసాయం కోసం రిజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తుందని రైతులకు భూమి కాలుష్యం,నీటి కాలుష్యం గాలి కాలుష్య నివారణ పైన అదే విధంగా పురుగుమందుల నిషేధం కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని కాల్వశ్రీరాంపూర్ R.A. ప్రాజెక్టు మేనేజర్ T. సతీష్ కుమార్ పేర్కొనడం జరిగింది ఇందులో భాగంగా మార్చి చివరి శనివారం ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ అనే ప్రోగ్రాం ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మార్చి 28 శనివారం రోజు వసతి గృహంలో మరియు పరిసర ప్రాంతాల్లో గంటపాటు విద్యుత్ ఆఫ్ చేయడం జరిగింది ఇలా చేయడం వల్ల విద్యుత్ ఆదా అవడం మరియు పర్యావరణంలో ఉష్ణోగ్రత తగ్గి వాతావరణం చల్లబడుతుందని వారు పేర్కొనడం జరిగింది అదేవిధంగా వసతిగృహంలోని విద్యార్థులకు పర్యావరణంపై పరీక్ష నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ బంగారి రమేష్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ పాల్గొని పర్యావరణం గురించి మాట్లాడడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి W.W.F. INDIA నవ క్రాంతి F.P.C.L R.A ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్లాలని వారు తెలిపారు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు మేము కూడా ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ క్రాంతి R.A. ప్రాజెక్ట్ మేనేజర్ T.సతీష్ కుమార్ F.P.C.L సిబ్బంది, వసతి గృహం సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది
.
Aksharam Telugu Daily