Friday, 06 March 2026 03:06:18 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వేదవ్యాస పాఠశాలలో పూర్వ విద్యార్థినికి ఘన సన్మానం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 03 January 2026 09:19 AM Views : 175

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా, జనవరి 2 అక్షరం న్యూస్:తమిళనాడు రిం ఫైర్ అండ్ ఎయిర్ ఫైల్స్ బెంచ్ రెస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఓపెన్ నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 షూటింగ్లో కాంస్య పథకం సాధించిన మండల కేంద్రంలోని వేద వ్యాస హై స్కూల్ 2023-24 బ్యాచ్ పూర్వ విద్యార్థిని ఎలగందుల సాయి ప్రణవిని వేదవ్యాస హైస్కూల్ ప్రాంగణంలో మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి శాలువాతో ఘనంగా సత్కరించారు వీరితోపాటు ఇటీవల విశాఖపట్నం లో జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన 15 మంది విద్యార్థులను వారు ఘనంగా సన్మానించారు.మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రమశిక్షణగా నైపుణ్యాలని నేర్చుకుని మెరుగుపరుచుకుంటే భవిష్యత్ తరాలకు ఉత్తమ క్రీడాకారులను మరియు పౌరులను అందించవచ్చు అని తెలియజేశారు క్రీడలు శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతాయని తెలియజేశారు . అబాకస్,క్విజ్,డాన్స్, చెస్ మరియు కరాటే పోటీల్లో రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచేలా చేస్తున్న వేదవ్యాస హై స్కూల్ యాజమాన్యాన్ని మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ బంగారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాలలో నిష్ణాతులుగా చేస్తున్నందుకు, మరియు జాతీయస్థాయిలో మోస్ట్ ఇన్స్పైరింగ్ ఎక్సలెన్స్ స్కూల్ ఆఫ్ ఇండియా అవార్డును గెలుపొందినందుకు యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని మరియు వారికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్ మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొన్నాయి టెంకం శివరామకృష్ణ వార్డు సభ్యులు గోలి నరేష్, సొన్నాయి టెంకమ్ అనిత అన్వేష్,సీనియర్ కబడ్డీ ప్లేయర్ దుస్స సదయ్య,పేరెంట్స్ కమిటీ మెంబర్ తాండ్ర సురేష్,కల్వల శ్యామ్, క్రీడాకారిని తల్లిదండ్రులు ఎలగందుల శేఖర్,మాధురి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :