Friday, 20 November 2026 01:47:53 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ పెద్ద సర్జరీ లేకుండానే మరుసటి రోజే నడిచే అవకాశం సీనియర్ ఆర్థ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 November 2026 01:18 PM Views : 34

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 19 అక్షరం న్యూస్ తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక వైద్య విధానాలతో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెరుగైన చికిత్స అందించవచ్చని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ తెలిపారు.గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక విరుపుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతను వివరించారు.సాధారణంగా తుంటి ఎముక విరిగినప్పుడు కీలును పూర్తిగా మార్చడం లేదా ఎముకను తిరిగి అతికించడం అనే రెండు మార్గాలు ఉంటాయని,అయితే కీలు మార్పిడి శస్త్రచికిత్స పెద్దది కావడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరగడంతో పాటు ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.ఈ సమస్యలకు పరిష్కారంగా ఎముకలు బలహీనంగా ఉన్నవారికి పీఎఫ్ఎన్ఏ విత్ సిమెంట్ ఆగ్మెంటేషన్ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమమైన జాన్సన్ అండ్ జాన్సన్ టైటానియం రాడ్‌ను అమర్చి, ఎముక బలహీనంగా ఉన్న చోట బోన్ సిమెంట్ నింపడం ద్వారా గట్టి పట్టు వచ్చేలా చేస్తామని వివరించారు.చాలా తక్కువ సమయంలో, ఎలాంటి రిస్క్ లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స ద్వారా రోగులు ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే మంచంపై కూర్చోవడమే కాకుండా, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చని బ్రిజేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణరావు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :