Wednesday, 04 March 2026 01:48:40 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మహనీయులు అంబేద్కర్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహన్ని ప్రారంభించిన టిజిఐడిసి చైర్మన్ విజయబాబు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 15 April 2025 03:07 PM Views : 930

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్ 14 (అక్షరంన్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికే మార్గదర్శకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర ఐ డి సి చైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. సోమవారం కామేపల్లి మండలం లోనీ పెంజరమడుగు గ్రామంలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మువ్వా విజయబాబు ఈ మాట్లాడుతూ ఆయన రాసిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిశానిర్దేశం అయింది అని, ఆయన కలలు కన్న సమాజాన్ని నిర్మించడమే మనందరి లక్ష్యం అని పిలుపునిచ్చారు. ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్లే ఈనాడు వ్యవస్థలన్నీ ఆ రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయం సమానత్వం హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ మార్గదర్శనాన్ని అనుసరిస్తూ పని చేస్తోందని, దేశ ప్రజల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ ఫార్మర్ హెర్ ఫర్ కమిషనర్ డైరెక్టర్ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చరణ్ రెడ్డి, కామేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :