Wednesday, 04 March 2026 01:39:51 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కార్పొరేట్‌కు దీటుగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి .... అధునాతన సౌకర్యాలతో విస్తృత వైద్య సేవలు ...కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావు

రోజుకు 1000–1500 ఔట్‌పేషెంట్లు ... ఇన్‌పేషెంట్లతో నిండిపోతున్న జనరల్, ఎంసిహెచ్ విభాగాలు ...కంటికి రెప్పలా కాపాడుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 20 December 2025 08:01 PM Views : 1042

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ పెద్దపల్లి అక్షరం ప్రతినిధి; పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గత ఒక సంవత్సర కాలంలో అన్ని వైద్య విభాగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించి, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తోంది. మెడికల్ సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ సమర్థ నాయకత్వం, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా సామాన్య ప్రజలకు హైదరాబాద్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. రోజుకు సగటున 1000 నుండి 1500 మంది వరకు ఔట్‌పేషెంట్లు చికిత్స పొందుతుండగా, జనరల్ మరియు ఎంసిహెచ్ విభాగాలు ఇన్‌పేషెంట్లతో నిండిపోతున్నాయి. పక్క జిల్లాల నుంచి సైతం రోగులు పెద్దపల్లి ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ప్రసూతి వైద్య సేవల్లో సమూల మార్పు గతంతో పోలిస్తే ప్రసూతి సేవలు అత్యంత మెరుగయ్యాయి. డెలివరీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో తక్కువ డెలివరీలు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వంటి సమస్యలు ఉండగా, ప్రస్తుతం అవన్నీ అధిగమించబడ్డాయి. రోగుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ 24 గంటలూ ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. ప్రసవానంతర తల్లులకు ప్రతిరోజూ ఫోన్ కాల్స్ ద్వారా ఫాలోఅప్ చేస్తున్నారు. అవుట్ పేషంట్ రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో సిబ్బంది రోగులను గౌరవప్రదంగా స్వీకరిస్తున్నారు. రోజూ ఇద్దరు గైనకాలజిస్టులు ఏ ఎన్ సి చెకప్‌లు నిర్వహిస్తున్నారు. ఏ సమయమైనా వచ్చిన గర్భిణులను తిరస్కరించకుండా అడ్మిషన్ తీసుకుంటున్నారు. టి ఏ హెచ్ శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. హెచ్బీఎస్ ఏజీ, హెచ్ఐవి పాజిటివ్ రోగులకు కూడా సురక్షిత డెలివరీలు నిర్వహిస్తూ, నవజాత శిశువులకు వెంటనే పీడియాట్రిషియన్ సేవలు, అవసరమైతే ఎస్ ఎన్ సి యు చికిత్స అందిస్తున్నారు. కంటి వైద్య సేవల్లో రాష్ట్రస్థాయి ప్రాభవం కంటి వైద్య విభాగం గత ఏడాది కాలంగా అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. రోజుకు 80–100 మంది ఔట్‌పేషెంట్లకు సమగ్ర కంటి సంరక్షణ సేవలు అందిస్తున్నారు. నెలకు సగటున 145 ప్రధాన కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అర్హులైన రోగులకు ఉచితంగా కళ్లజోడ్లు, కరెక్టివ్ లెన్సులు అందిస్తున్నారు. రాష్ట్రంలోని TVVP ఆసుపత్రులలో అత్యధిక కంటి శస్త్రచికిత్సలు పెద్దపల్లి ఆసుపత్రిలోనే జరుగుతుండగా, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి తర్వాత అత్యధిక సర్జరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రిగా ఇది నిలుస్తోంది. ఆర్థోపెడిక్ సేవల్లో గణనీయమైన పురోగతి ఆర్థోపెడిక్ విభాగంలో ఇద్దరు సీనియర్ సర్జన్లతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. గతంలో నెలకు 5–10 శస్త్రచికిత్సలు మాత్రమే జరిగేవి కాగా, ప్రస్తుతం నెలకు 35–40 ప్రధాన సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య సేవలు – ఎస్ ఎన్ సి యు కీలక భూమిక పిల్లల ఓపిడి సంఖ్య పెరిగింది. ఎస్ ఎన్ సి యు విభాగం సమర్థవంతంగా పనిచేస్తోంది. రోగులకు అవసరమైన అన్ని మందులు, ల్యాబ్ సేవలు ఆసుపత్రిలోనే అందుతుండటంతో బయట మందులు కొనాల్సిన అవసరం లేదు. రోజుకు సుమారు 125 మంది పిల్లలకు, నెలకు దాదాపు 320 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. జనరల్ సర్జరీ – ఆధునిక వైద్య విధానం జనరల్ సర్జరీ విభాగంలో క్రిటికల్ మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. నెలకు 15–20 మేజర్ సర్జరీలు, 3 లాపరోస్కోపిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. జనరల్ మెడిసిన్ – ఆసుపత్రికి ప్రాణాధారం ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, ఇద్దరు ఛాతీ వైద్యులతో అన్ని వయసుల రోగులకు అత్యవసర, దీర్ఘకాలిక వ్యాధులకు సమగ్ర చికిత్స అందిస్తున్నారు. రేడియాలజీ సేవలు – 24×7 నమ్మకమైన నిర్ధారణ నెలకు 1900–2000 అల్ట్రాసౌండ్ స్కాన్‌లు, సుమారు 200 టిఫ్ఫా స్కాన్‌లు నిర్వహిస్తున్నారు. ఇద్దరు రేడియాలజిస్టుల సేవలతో పాటు 24 గంటల ఎక్స్‌రే సౌకర్యం అందుబాటులో ఉంది. దంత, కార్డియాలజీ, ఫిజియోథెరపీ సేవలు దంత విభాగంలో నెలకు 350–400 చికిత్సలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రారంభమైన కార్డియాలజీ విభాగంలో నెలకు 200 2D ఎకోలు, 500 ఈసీజీలు నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపీ విభాగంలో అన్ని ఆధునిక పరికరాలతో నెలకు సుమారు 600 మంది రోగులకు సేవలు అందుతున్నాయి. ల్యాబ్, పోస్ట్‌మార్టం, డయాలిసిస్ సేవలు తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవల్లో టర్న్‌అరౌండ్ టైం తగ్గడంతో పరీక్షల సంఖ్య పెరిగింది. మార్చురీ రూమ్ పరిశుభ్రంగా ఉండగా, నెలకు 20–25 పోస్ట్‌మార్టంలు జరుగుతున్నాయి. ఐదు పడకల డయాలిసిస్ యూనిట్‌లో 33 మంది లబ్ధిదారులు రోజూ సేవలు పొందుతున్నారు. పరిశుభ్రత, సౌకర్యాలు – ప్రజల నమ్మకం వార్డులు, థియేటర్లు, వాష్‌రూమ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. ఇండోర్ ప్లాంట్లు, క్యాంటీన్, పిల్లల ప్లే జోన్, ప్రత్యేక తల్లిపాలు గదులు, అన్ని ఓ పి లలో ఏసీలు ఏర్పాటు చేయడంతో ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. భవిష్యత్ ప్రణాళికలు త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు ... ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ భవిష్యత్తులో ఆసుపత్రి మెరుగుపరచడానికి నూతన ప్రాణాలేఖలు చేపట్టడంతో పాటు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో మరింత సేవలు మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. త్వరలోనే రూ.20 కోట్ల విలువైన ఎంఆర్ఐ సిటీ స్కాన్ల తో పటు వెంటిలేటర్ల ఎక్విప్మెంట్ అందుబాటులోకి రానుందనీ వివరించారు. అలాగే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ ను కంటికి రెప్పలా చూసుకుంటామని, ఏ ఒక్క పేషెంట్ కూడా అసంతృప్తితో ఇంటికి వెళ్లకూడదు అన్న లక్ష్యంతో ఆసుపత్రి యంత్రాంగం పూర్తి బాధ్యతతో పని చేస్తోందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :