D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మే20(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంకార్పొరేట్ శక్తులు, ఆన్‌లైన్ కంపెనీలు మెడికల్ మాఫియా.గా మారి, డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందులను అంటగడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి" అని కొత్తగూడ మండల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు కట్టుకోజు రవీంద్ర చారి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా బుధవారం మండలంలో మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.ఈ సందర్భంగా రవీంద్ర చారి మాట్లాడుతూ... నాడు కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడింది మీ స్థానిక మెడికల్ షాపు వాళ్లే. అర్ధరాత్రి వేళ ప్రాణం మీదికి వస్తే కనురెప్ప వేయకుండా మందులిచ్చి ఆదుకునేది మేమే. దయచేసి ఆన్‌లైన్ జోలికి వెళ్ళకండి, అక్కడ మందులు తెచ్చుకోకండి. ఆ నకిలీ మందులతో మీ ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దు. ఆన్‌లైన్ మాయ వల్ల స్థానిక వ్యాపారులు వీధిన పడే పరిస్థితి వస్తోంది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేయకుండా స్థానిక వ్యాపారులను కాపాడుకోండి" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్ నారాయణ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily