Thursday, 06 August 2026 02:48:07 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అభివృద్ధి అంశాలు పక్కన పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు గజ్జెల రాజు

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 05 August 2026 05:30 PM Views : 283

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -05(అక్షరం న్యూస్ ) బీజేపీ నాయకులు అభివృద్ధి అంశాలు పక్కన పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ భవనానికి వేసిన రంగుల వివాదం లో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. బుధవారం పార్టీ కార్యాలయం లో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల తో కలసి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు జాతీయ జెండా లోని రంగులను పాకిస్తాన్ తో ముడిపెట్టడం దేశ భక్తి కాదని బీజేపీ నాయకుల కండువా లో కూడా ఆకు పచ్చ రంగు ఉందని అన్నారు రాష్ట్ర .కాంగ్రెస్ రైతుకు రెండు లక్షల రుణ మాఫీ, ఇందిరమ్మ ఇల్లు,ఉచిత విద్యుత్,ఉచిత బస్సు ప్రయాణం, రు.10 లక్షల వరకు ఉచిత వైద్యం, రైతులకు రైతు భరోసా, ఎన్నో పథకాలు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులపై, సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు_ కాంగ్రెస్ పార్టీపై, కార్యకర్తలపై గాని అనుచిత వాక్యాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ తాళ్ళ విజయ్ రెడ్డి,ఆరుట్ల మహేష్ రెడ్డి,వార్డు సభ్యులు రంజాన్ నరేష్, లీగల్ సెల్ కన్వీనర్ సారగు రాకేష్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్, కొండాపూర్ యారటి కరుణాకర్,బండి శ్రీకాంత్, చాకలి బాబు,ఏద్దెండి మహేష్,ఎన్ ఎస్ యూ ఐ నాయకులు భాను, సారుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు_*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :