GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల/ ముస్తాబాద్,/ జూలై -31(అక్షరం న్యూస్) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి పరిశీలించారు. విద్యార్థులచే హిందీ ఇంగ్లీష్ పాఠాలను చదివించారు. స్కూల్ లోని విద్యార్థుల హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ వివరాలు తెలుసుకున్నారు.వీరి వెంటఁ మండల విద్యాధికారి పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily