Friday, 06 March 2026 03:24:58 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయం జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి

డిహెచ్.పి.ఎస్ ఆధ్వర్యంలో జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.... ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిహెచ్. పి.ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి : సలిగంటి శ్రీనివాస్


MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 08 October 2025 07:33 PM Views : 609

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/కొత్తగూడెం/అక్టోబర్ 08 /అక్షరం న్యూస్: డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ (బి.ఆర్) గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోలుత పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అనంతరం ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ అనుబంధ సంఘం దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వం. ఈ కార్యక్రమానికి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు బరిగెల భూపేష్ కుమార్ అధ్యక్షత వహించగా.... ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు,డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ రాకేష్ కిషోర్ వేసిన పిల్ పై ప్రసంగిస్తూ మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో నీ ఆలయాల విషయం భారత పురావస్తు శాఖ(ఆర్కియాలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా) పరిధిలో ఉంటుందని, మీరు సుప్రీంకోర్టు గుమ్మం తట్టే బదులు అక్కడికి వెళ్తే బాగుంటుందని సూచించారు, అందుకు ఆగ్రహించిన మతోన్మాది న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మం జోలికి వస్తే ఈ దేశం సహించబోదని నినాదాలు చేస్తూ తన బూటు తో సీజేఐ పై దాడి చేయడానికి ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకోవడం జరిగిందన్నారు. భారతదేశ న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయనమని పేర్కొన్నారు. దళిత జాతికి చెందిన జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన సీనియర్ న్యాయవాది, మతోన్మాది రాకేష్ కిషోర్ పై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి తక్షణమే బహిష్కరించి నాన్ బేయిలబుల్ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కరిషా రత్నకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు మామిడి ధనలక్ష్మి, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు రవి కిరణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, టి. నర్సింగరావు ,జంగం ప్రసాదరావు, మంద నిర్మల, పి.భాగ్య, మద్దెల విజయలక్ష్మి, మెరుగు అనసూయ, దార్ల లక్ష్మి, అన్నెం లక్ష్మీనారాయణ,పి.రోజా, ఉస్మాన్ ఖాన్, పి.నర్సిరెడ్డి, బి. సత్తెమ్మ,కే. భారతి, ఎండి ఆశబి, ఎండి యాకుబ్ పాషా, ఎస్.కె అహ్మద్ పాషా బట్టు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :