Friday, 24 July 2026 06:39:08 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఏజెన్సీ ప్రాంతాలలో జిల్లా వైధ్యాదికారి సుడిగాలి పర్యటన

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 15 July 2025 07:26 PM Views : 781

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం / జూలై15(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతంలోని కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దుబ్బగూడం, కామారం,మర్రిగూడెం, కోమట్ల గూడెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క రికార్డులను పరిశీలించి తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కల్పించే కార్యక్రమాలను క్షేత్రస్థాయి సిబ్బంది కల్పించాలని వారికి అవసరమైన సలహాలు సూచనలను ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే ప్రజలకు కీటక జనిత వ్యాధుల పైన అవగాహన కల్పించి ఒకవేళ ఎవరికైనా మలేరియా, డెంగ్యూ, పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి పూర్తిస్థాయి చికిత్స అందించలని ఆయన తెలిపారు. అంతేకాకుండా అసంక్రమణ వ్యాధుల పైన 30 సంవత్సరములు దాటిన వారందరికీ రక్తపోటు,షుగర్ వ్యాధుల పైన స్క్రీనింగ్ చేసి ఒకవేళ నిర్ధారణ జరిగినట్లయితే వారికి క్రమం తప్పకుండా మందులను అందించాలని ఆయన పేర్కొన్నారు, ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్ ఎల్ హెచ్ పి లు గ్రామాలలో క్యాంపులను ఏర్పాటు చేసి ఆర్డిటి పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్నటి దినము ప్రసవించిన బాలింత రాలు యొక్క ప్రసవానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను అందించారు.ఈ కార్యక్రమంలో కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సాయినాథ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్ ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ సూపర్వైజర్ రత్నకుమారి స్థానిక ఎమ్మెల్యే హెచ్. పి. లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :