Friday, 30 October 2026 03:37:09 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి!

కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మూడు గంటల పాటు మార్చురీ ఎదుట బాధిత కుటుంబంతో కలిసి ఆందోళన.. విచారణ జరిపించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 29 October 2026 05:30 PM Views : 47

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట, అక్షరం న్యూస్ అక్టోబర్ 29: తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని దావులగళ్ల లాస్య అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలను నిష్పక్షపాతంగా వెలికితీసి, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో లాస్య మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, సంతోష్‌లను పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అనంతరం బాధిత కుటుంబంతో కలిసి సుమారు మూడు గంటల పాటు మార్చురీ ఎదుట ఆందోళనలో పాల్గొని, లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటల వరకు బాగానే ఉన్న విద్యార్థిని తెల్లవారుజామున 5 గంటలకల్లా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షేమ గురుకులాలు ఎంతో కీలకమని, అలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, కనీస వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ప్రహరీ గోడలు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం విద్యార్థిని లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ హేమావతి స్పందిస్తూ, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని, లాస్య మృతి ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు...

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :