Wednesday, 13 May 2026 04:18:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యువతకు స్ఫూర్తిగా నిలిచిన దాసరి ఉష కృషి ఎస్.ఎస్.బి కమాండర్ ఆశీష్ పటేల్


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 May 2026 06:10 PM Views : 62

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే10 అక్షరం న్యూస్ యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ,గత 25 రోజులుగా పెద్దపల్లి నియోజకవర్గవ్యాప్తంగా సాగుతున్న జ్యోతిబా ఫూలే-అంబేద్కర్ జై యుగం కప్' క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది.బీసీ జేఏసీ చైర్‌పర్సన్ శ్రీమతి దాసరి ఉష ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్,పెద్దపల్లి మండలంలోని మదర్ థెరిస్సా కాలేజ్ గ్రౌండ్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగింది.మండల స్థాయి ఫైనల్ మ్యాచ్‌లో పెద్దకాల్వల మరియు కొత్తపల్లి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మైదానమంతా క్రీడాకారుల కేరింతలు, అభిమానుల కోలాహలంతో సందడిగా మారింది.ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పెద్దకాల్వల జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, విన్నర్స్ షీల్డ్‌తో పాటు రూ.10వేల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన కొత్తపల్లి జట్టు షీల్డ్ మరియు రూ.5వేల నగదును గెలుచుకుంది.ఈ ముగింపు వేడుకకు దాసరి ఉష భర్త ఎస్.ఎస్.బి కమాండర్ జుట్టు ఆశీష్ కుమార్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని,అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని కలుపుతూ గత 25 రోజులుగా ఇంతటి భారీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన దాసరి ఉష కృషిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళా కన్వీనర్ సిరవేణ స్వప్న,నర్ల సాయి,సంతోష్,20వ వార్డు కౌన్సిలర్ రాజేష్,ఎస్.సి.సి.ఎల్ కాంట్రాక్టర్ శ్రీనివాస్,అసెంబ్లీ కోఆర్డినేటర్లు భూమేష్,అబ్దుల్ మాలిక్,ఆర్గనైజర్ శ్రావణ్,రాజేందర్,సాగర్,క్రీడా కారులు,తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :