D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9 తల్లాడ (అక్షరంన్యూస్) రైతాంగానికి అవసరమైన యూరియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే సరఫరా చేయాలని ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రతినిధి బృందం తల్లాడ తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూఅఖిలభారత ఐక్య రైతు సంఘం ( ఏఐయు కెఎస్) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు కొండేవెంకటేశ్వర్లు మాట్లాడుతూ పత్తి పంటకు కనీస మద్ధతు ధర రూ. 10,075 లు నిర్ణయించాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్నిఉపసంహారించుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్ధతు ధరల చట్టాన్ని చేయాలని అన్నారు. గిరిజనులు ఇతర పేదలు సాగు చేసుకుంటున్న పోడుభూములలో పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేయాడాన్ని నిలిపివేయాలని, పంటలు ధ్వంసం చేసిన అటవీ అధికారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు ఎన్నో సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుని జీవిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు వందలాదిమంది రైతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అయినా గత ప్రభుత్వం సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వలేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుదారులందరికి పోడు భూములుకు పట్టాలు ఇవ్వాలని అన్నారు పత్తి దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 11 శాతం దిగుమతి సుకాన్ని తగ్గించటాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయటంలో విఫలమైనదని రాష్ట్రానికి రావాల్సి ఉన్న 9.80 లక్షల మెట్రిక్ టన్నులలో కేవలం 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా చేసిందని అందువలన 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా కొరతా ఏర్పడిందని అన్నారు రాష్ట్రంలో వరి, పత్తి మొక్కజొన్న, వంటలకు యూరియా అవసరం, సకాలంలో యూరియాను పోలాలకు వేసుకోలేని పక్షాన పంటలు వేపుగా పెరగవని, దాని వలన దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా మాట్లాడుతూ ఇటీవల కురిసిన అదిక వర్షాల వలన రాష్ట్రంలో 13 జిల్లాలలో వరద తాకిడికి గురై పంటలు దెబ్బతిని రైతుల పంటలు నష్టపోవడం జరిగిందని అన్నారు. పంటలు నష్టపోయినా రైతాంగానికి ఏకరాకు 50 వేల రూపాయలు సష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు గిరిజనులు ఇతర పేదల ఏన్నో సంవత్సరాలుగా సాగుచేసుకొని జీవిస్తున్న పోడు భూముల్లో అటవీ అధికారులు వారి పత్తి మొక్కజొన్న ఇతర పంటలను పీకివేస్తున్నారని వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై ఉన్న 11శాతం పన్నును రద్దు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు .
.
Aksharam Telugu Daily