GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/సెప్టెంబర్ 12/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో మహిళలు ముందడుగు వేసి అభివృద్ధిని సాధించవచ్చని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. శుక్రవారం జీవన జ్యోతి పట్టణ సమాఖ్య సమావేశానికి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ పట్టణంలో మహిళలు మీరు తీసుకొనే లోన్ తో ఆర్థికంగా ఎదగాలని, జమ్మికుంట మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిర్మూలనకు మహిళలు ముందడుగు వేస్తే సంపూర్ణంగా నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. మహిళ సంఘాలలో ఉన్న సంఘ సభ్యులకు జ్యూట్ బ్యాగ్స్ అందించామని, మహిళలు కూరగాయలకు, ఎటువంటి షాపింగ్ లకు వెళ్లినప్పుడు వాటినే ఉపయోగించాలని ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిర్మూలించాలని ఆయన సూచించారు. మహిళలు మీరు సంఘం నుండి తీసుకొనే లోన్ ఇప్పటి వరకు 20.00 లక్షలు, ఆది కోటి రూపాయల వరకు తీసుకోవాలని, మహిళలు ఆ లోన్ తో ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి ఎదగాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంత్, జీవన జ్యోతి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రాణి, కార్యదర్శి మౌనిక, కోశాధికారి గీత, సి. ఎల్. అర్పిలు జ్యోతి, మంజుల, టిఎల్ ఫ్ ఆర్పి సరళ తో పాటు సమాఖ్య అధ్యక్షులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily