DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి | డిసెంబర్ 12 | అక్షరం న్యూస్ : అక్షరమే ఆయుధంగా నిజాలను నిర్భయంగా వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్న పత్రిక అక్షరం దినపత్రిక అని పెద్దపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజ్జి కృష్ణ ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై భయంకాకుండా వెలుగులోకి తెస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న పత్రికగా అక్షరం ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. సోమవారం అక్షరం దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్‌ను ఏసిపి గజ్జి కృష్ణ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పత్రికలు నాలుగో స్థంభంగా వ్యవహరిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆ బాధ్యతను అక్షరం దినపత్రిక సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అభినందించారు. అక్షరం దినపత్రిక ప్రచురిస్తున్న కథనాలు నిజాయితీ, నిష్పక్షపాతత్వం, ప్రజా ప్రయోజనం అనే మూలసూత్రాలతో సాగుతున్నాయని ఏసిపి తెలిపారు. చట్టం, న్యాయం, శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని, ఆ దిశగా అక్షరం దినపత్రిక పోలీస్ శాఖకూ ప్రజలకు మధ్య అవగాహన పెంచే వేదికగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, పెద్దపల్లి అక్షరం ప్రతినిధి దొమ్మటి రాజేష్, సీనియర్ పాత్రికేయులు సోమకుమార్, పని సుదర్శన్, నూనె శ్రీనివాస్తో పాటు పలువురు పాత్రికేయులు, అక్షరం దినపత్రిక సిబ్బంది పాల్గొన్నారు. ఏసిపి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం పత్రికకు మరింత ప్రోత్సాహం, గౌరవంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily