Friday, 20 November 2026 01:47:51 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బీజేపీ అనుచిత వాక్యాలకు బగ్గుమన్న పట్టణ అధ్యక్షుడు నిరసనగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం పెద్దపల్లి ప

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 November 2026 03:54 PM Views : 133

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 18 అక్షరం న్యూస్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వాక్యాలపై పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రతిపక్ష నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్ మాట్లాడుతూ. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బీజేపీ నాయకులు ప్రజాస్వామ్య విలువలను మరిచి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, సామాన్య ప్రజల ఆర్థిక ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం, మహిళలకు భద్రత కల్పించడం, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈర్ల స్వరూప, పాగాల శ్రీకాంత్, మంథని నర్సింగ్, అమరేష్, దొడ్డుపల్లి జగదీష్, కమల్, గుజ్జుల కుమార్, తోట ఫణీందర్ భూపతి, సుభాస్, రాజేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్, పేర్క సంతోష్, సుధాకర్, పార్టీ నాయకులు, క్రాంతి, కొమ్ము శ్రీనివాస్, సురేందర్, యువజన కాంగ్రెస్ నాయకులు కొలిపాక శ్రవణ్, మసూద్, కళ్యాణ్, గంగుల వెంకటేష్, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :