Friday, 06 March 2026 03:23:54 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దాడ వారి ఔదార్యం వనవాసి కి వంట పాత్రలు వితరణ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 September 2025 04:21 PM Views : 790

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 14/అక్షరం న్యూస్/----- పెద్దాడ వెంకట గోపాలస్వామి శ్రీమతి పార్వతి శ్రీమతి ప్రమీల జ్ఞాపకార్థం వారి మనవడు ముప్పిరిశెట్టి జ్ఞానేశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు శేషారావు వరలక్ష్మీ దంపతులు వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయం విద్యార్థులకు ఒక పూట భోజనము మరియు వంట పాత్రలను వితరణ గా అందజేశారు. అనంతరం వనవాసి తెలంగాణ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామాల ఆదివాసీ విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు చక్కటి విద్యా బుద్ధులు నేర్పిస్తూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటు పడుతున్న వనవాసి కళ్యాణ పరిషత్ సేవలకు ముగ్ధులై హైదరాబాద్ వాస్తవ్యులైన శేషారావు వరలక్ష్మి దంపతులు విద్యార్థులకు అవసరమగు వంట పాత్రలను వితరణ గా అందజేశారని ఆమె అన్నారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవ్వాది మొరళీ కృష్ణ ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు కమిటీ సభ్యులు పొలిన రమాదేవి గ్రామీణ వైద్యులు బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :