Monday, 15 December 2025 06:49:16 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..

అక్రమ కేసు ఉపసంహరించుకోకపోతే ఆందోళనలకు పిలుపునిస్తాం... టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు కు వినతి..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 September 2025 09:12 PM Views : 364

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లోని పిఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కొరతతో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీడియో కవరేజ్ లో ఉన్న టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాల "టి న్యూస్ ఛానెల్" ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావుపై అదేవిధంగా వీడియో జర్నలిస్టు,4జి కిట్ టెక్నీషియన్ లపై కొనిజర్ల మండల పోలీసులు పెట్టిన అక్రమ కేసులను పున పరిశీలించి తక్షణమే ఉపసంహరిం చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిల ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.... జర్నలిస్టులపై న అకారణంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని అడిషనల్ డిసిపిని కోరారు. లేదంటే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనల కు పిలుపునిచ్చేందుకు కార్యాచరణ చేస్తామని అన్నారు. ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. కేసులు పెట్టి జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి ,శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ ఉదయ్, హరీష్ వనం నాగయ్య చక్రవర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బి గుద్దేటి రమేష్ కార్యదర్శి , రాంబాబు , జిల్లా నాయకులు ఆతోటి శ్రీనివాస్ కోటేశ్వరరావు, తిరుపతి శ్రీనివాసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :