Thursday, 21 May 2026 09:39:55 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గంగారం మండలం మర్రిగూడెం లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 21 May 2026 03:27 PM Views : 157

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం/ మే21(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ గురువారం రోజున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి &స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి* ఆదేశాల మేరకు.. మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు గారి ఆధ్వర్యంలో *ఆధునిక భారతానికి పునాధులు వేసి, అణగారిన బతుకుల్లో వెలుగు నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన మహానేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా మర్రిగూడెంలో జరుపుకున్నారు మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ.. మన భారత దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడు అయినా ఆరవ ప్రధాన మంత్రి మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిననేత, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ దేశంలో స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి పంచాయితీ రాజ్ వ్యవస్థకు చట్టబద్దత కల్పించారు. కంప్యూటర్ మరియు టెలికాం విప్లం భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మరియు టెలికాం విప్లవానికి ఆయనే పునాది వేశారు. గ్రామీణ ప్రాంతాలకు సీతం తెలిఫోన్ సేవలు ( యస్ టిడి పిసి ఒ )విస్తరించారు. 1989లో రాజ్యాంగ సవరణ చేసి ఓటు హక్కు పొందే వయస్సును 21 సంవత్సరాలనుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. శాంతి ఒప్పంధాలు ఈశాన్య రాష్టాల్లో శాంతిని పునరుద్దరించడానికి అసోం ఒప్పందం, మీజో ఒప్పందం వంటి కీలకమైన శాంతి ఒప్పంధాలపై సంతకం చేశారు. ఆయన కుటుంబ నేపథ్యం భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్లల్ నెహ్రూ మనుమడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్షం నాయకులు రాహుల్ గాంధీ నాన్నగారు 1984 అక్టోబర్ లో తల్లి ఇందిరా గాంధీ హత్యకు గురికావడంతో తల్లికి అండగా అనూహ్య పరిస్థితుల్లో అయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తరువాత భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చివరిగా తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో 1991 మే 21 జరిగిన ప్రచార సభలో ఎల్,టి,టి,ఇ (LTTE ) ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. భారతదేశ సాంకేతిక పురోగతికి మరియు ఆధునికరణకు రాజీవ్ గాంధీ అందించిన సేవలను గంగారం మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దెల సాంబయ్య, మర్రిగూడెం సర్పంచ్ మేడ స్వరూప సారయ్య, ఉప సర్పంచ్ సువర్ణపాక దీపక్, వార్డు నంబర్ లు కిరణ్మయి దీనెష్, మద్దెల లక్ష్మి సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపెల్లి తనీషా, సువర్ణపాక సమ్మరావు, సువర్ణపాక లక్ష్మీనర్సు, బొల్లెపెల్లి నాగేశ్వరావు, మహమ్మద్ హైమద్, సువర్ణపాక సురేందర్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :