Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 10 అక్షరం న్యూస్ పెద్దపల్లిలో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది ఎదురుగాలులు వర్షానికి పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో ఒక ఇంటి పైకప్పు కూలీ రోడ్డుపై పడింది కింద ఎవరు లేకపోవడంతొ ప్రాణాపాయం తప్పింది హార్డింగ్ల్ విరిగి కింద పడిపోయాయి గాలి బీభత్సానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి ఒకసారి గా వచ్చిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది వడ్లు కొట్టుక పోయి మట్టిలో కలిసిపోయాయి పెద్దపల్లికి చెందిన అల్లేపు సారయ్య రెండు ట్రాక్టర్ల వడ్లు వర్షానికి కొట్టుకపోయి మట్టిలో కలిసాయని కంటతడి పెట్టుకున్నడు పది ఎకరాల పొలం కౌలుకు పట్టి అమ్మడానికి వ్యవసాయ మార్కెట్ కు తీసుకువస్తే అకాల వర్షంతో నష్టం జరిగిందని వాపోయాడు కొట్టుకపోయిన వడ్లు ఎత్తుకుందామన్న చేతికి రావడం లేదని వాపోయాడు రైతులందరి వడ్లు కొట్టుకపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదనకు గురయ్యారు అలాగే ఎంబడి రాజు తనకున్న రెండు ఎకరాల పొలం శనివారం రోజు కోయడం జరిగిందని వ్యవసాయ మార్కెట్లో అమ్మడానికి తీసుకోవచ్చి ట్రాక్టర్ తో వాటిలో కింద పోయడంతోనే భారీ వర్షం స్టార్ట్ అయిందని ఏం చేయలేని పరిస్థితి నెలకొందని అన్నాడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పలువురు రైతులు ఆరోపించారు ప్రతిసారి వడ్లు అమ్మడానికి తీసుకువచ్చినప్పుడు అకాల వర్షాలతో ఇలా వాళ్ళు కొట్టుకపోవడం కొత్తేమీ కాదని ఆరుగాలం పండించిన పంటను అమ్మడానికి తీసుకోవస్తే ఇక్కడ సరైన వసతులు లేక రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని రైతులందరూ ఆగ్రహం చేశారు వడ్ల కనుగోలు తొందరగా జరగడంలేదని వర్షాలు ఉన్నాయని పలువురు రైతులు తెలియజేసిన పట్టించుకోవడంలేదని పైసలు ఇచ్చిన రైతులకే న్యాయం జరుగుతుందని పలువురు రైతులు యాజమాన్యంపై మండిపడుతున్నారు అధికారులు స్పందించి వెంటనే రైతంగానికి న్యాయం చేయాలని కోరారు
.
Aksharam Telugu Daily