AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 17/ అక్షరం న్యూస్/----- సోయం భద్రయ్య వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం మనవడు మనుమరాలు కుర్సం రవితేజ కుర్సం లిఖిత వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయమునకు ఐదు వేల రూపాయల వితరణ ను నిలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం అల్లుళ్లు తెల్లం రమణయ్య కుర్సం ఎర్రయ్య లు మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ఆదివాసి విద్యార్థులను వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయం అక్కున చేర్చుకొని వారికి మంచి క్రమశిక్షణ దైవభక్తి దేశభక్తితో పాటు సత్ప్రవర్తన కలిగిన విద్యను అందిస్తూ ఆదివాసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వనవాసి సేవలు మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ కార్యదర్శి జవ్వాది మొరళీ కృష్ణ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily