D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఆగష్టు 4(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బూర్గ గుంపు లో ఆగస్టు 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రెండు అంగన్వాడి కేంద్రాలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రామలక్ష్మి, యంపిపి పాఠశాల హెచ్‌ఎం అరుణ, జమున, అంగన్వాడి టీచర్లు బంగారి సమ్మక్క, కంగాల స్వరూప, వార్డు సభ్యుడు కంగాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవి శిశువు ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని వివరించారు. గర్భిణీలు, బాలింతలు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి చిన్నారికి తల్లిపాలు అందేలా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily