AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ మే 25 కాళేశ్వరంలో మే 22 నుండి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలో భారీ ట్రాఫిక్ జాం.. 15 కిమీల మేర నిలిచిన వాహనాలు కాళేశ్వరం లో మే 22 నుండి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుష్కరాలు రెపటి తో ముగుస్తుండటంతో భక్తులు భారీగా కాళేశ్వరానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో మహాదేవపూర్- కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్‌ను వన్-వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయంతో భక్తులు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయి, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఇటు చెన్నూర్ నుండి మహారాష్ట్ర మీదుగా వచ్చే వాహనాలు కాలేశ్వరం నుండి దరిదాపు చెన్నూరు భీమవరం గ్రామాల దాకా ట్రాఫిక్కు పూర్తిగా జామ అవడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలమైతున్నారు గంటల తరబడి పిల్లలు వాహనాలలో ఉండి ఒకపత్తుతో ఇబ్బంది పడుతున్నారు ఆదివారం కావడంతో అనేక వీఐపీలు భారీ ఎత్తున పుష్కరాలకు రావడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ అవడం జరిగిందని భక్తులు ఆబోతున్నారు వాహనాల రద్దీ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఇది భక్తులను మరింత గందరగోళంలో పడేయడమే కాకుండా తీవ్ర అసౌకర్యం కలిగించింది. అడవిలోకి మళ్లించిన ట్రాఫిక్ వల్ల రోడ్లు ఇరుకుగా ఉండటం, లైటింగ్ లేకపోవడం, గూగుల్ మ్యాప్‌లలో సరైన రూట్ సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు ఇది ఇలాగే జరిగితే దర్శనానికి దరిదాపు పది నుండి 11 గంటల పట్టి సమయం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
.
Aksharam Telugu Daily